Saturday, April 27, 2024
HomeCinemaరామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC 16 సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్..

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC 16 సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్..

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాల మీద సినిమా అవకాశాలు వస్తున్నాయి, ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చెంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ మొన్ననే పూర్తి చేసుకుంది. పోయిన డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావలసి ఉంది కానీ రామ్ చరణ్ తండ్రి అవ్వటంతో 3 నెలలు సినిమా నుంచి బ్రేక్ తీసుకుని కూతురితో సమయం గడిపాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందో లేదో అప్పుడే మరో సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ తో గేమ్ చెంజర్ సినిమా పూర్తి అయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో RC16 సినిమా కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయనుంది. ఈ సినిమా మొన్ననే పూజా కారెక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ కి సిద్ధం అవుతుంది.

on-occassion-of-ram-charan-brithday-director-buchibabu-sana-and-team-releases-rc-16-poster

ఐతే ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కాగా అభిమానుల కోసం డైరెక్టర్ బుచ్చిబాబు ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఆ పోస్టర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కొందరికి ఆ పోస్టర్ నచ్చి రిలీజ్ చేసినందుకు డైరెక్టర్ కి ధన్యవాదాలు చెప్పగా మరికొందరు అసలు ఏంటి ఆ పోస్టర్ అంటూ నెట్టింట తిట్టిపోస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts