Friday, May 10, 2024
HomeCinemaSalaar 2 : ప్రభాస్ - నీల్ సలార్ 2 లో మరో బాలీవుడ్ భామ.....

Salaar 2 : ప్రభాస్ – నీల్ సలార్ 2 లో మరో బాలీవుడ్ భామ.. ఆమె ఎవరంటే..

Salaar 2 : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్న ప్రభాస్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈయన రెబెల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇటీవల ఈయన సలార్ సినిమాతో మన ముందుకి వచ్చి బారి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రశాంత్ నీల్. సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సలార్ 2 పై కూడా చాలా ఆశలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రశాంత్ నీల్ సలార్ 2 పై ప్రత్యేక దృష్టి సారించాడు.

సలార్ 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంట. ఆమె మరెవరో కాదు కియారా అద్వానీ. సలార్ సినిమాలో కీసర మరో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆన్ స్క్రీన్ పై వీరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది అని అభిమానులు నమ్ముతున్నారు.

kiara-advani-in-prabhas-prashanth-neel-salaar-2-latest-update

కియారా అద్వానీ సెకండాఫ్‌లో మాత్రమే తన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెండో భాగానికి శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేశారు. ఇదిలా ఉండగా, సలార్ 2 నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా మాట్లాడుతూ, “ఈ చిత్రం యొక్క రెండవ భాగం ఏప్రిల్‌లో నిర్మాణాన్ని ప్రారంభించి 2025లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. సలార్ పార్ట్ 2 మొదటి భాగం కంటే బారి విజయం సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts