Home News Delhi Robbery : ఢిల్లీలో పట్టపగలు దోపిడీ.. హాలీవుడ్ స్థాయిలో చేశారు..

Delhi Robbery : ఢిల్లీలో పట్టపగలు దోపిడీ.. హాలీవుడ్ స్థాయిలో చేశారు..

Delhi Robbery : ఢిల్లీలో దారుణం, పట్టపగలే ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద ఓ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడి చేసి.. ఆ కారులో ప్రయాణిస్తున్న డెలివరీ ఏజెంట్ వద్ద రెండు లక్షల రూపాయిలు దోపిడీ చేశారు. అక్కడ జరిగింది అంత సీసీటీవీ ఫ్యూటేజ్ లో రికార్డు అయ్యింది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై స్పందించి దుండగులపై కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితుడితో మాట్లాడి ఇచ్చిన నివేదిక ప్రకారం, వారు గురుగ్రంకు 2 లక్షల రూపాయలు డెలివరీ చేయడానికి వెళ్తున్నారు.

టాక్సీ లో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై ఫాలో అవుతూ, కారు టన్నెల్ దాటుతుండగా ఆపి గన్స్ తో బెదిరించి తమ వద్ద డబ్బులు దొంగలించారు అని మా తెలుగుమైక్ కు తెలిపారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజిర్వాల్ స్పందిస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను రాజీనామాకు పిలుపునుంచి తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్టపగలు అందరు చూస్తుండగా జరిగింది.

కెజిర్వాల్ మాట్లాడుతూ, ఈ ఢిల్లీ ప్రజల భద్రత చూసుకోవడం సెంట్రల్ గవర్నమెంట్ కు చేతకాకపోతే అది మా చేతికి వదిలేయండి అని అన్నారు. మాకు ఢిల్లీ ప్రజల భద్రతే ముఖ్యం.. మా టీమ్ ఈ కేసును హ్యాండోవర్ చేసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ చూసి నేర్చుకోండి అంటూ ప్రధానమంత్రిపై కెజిర్వాల్ మండిపడ్డారు. ఢిల్లీని క్రైమ్ ఫ్రీ చేయడానికే మా ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది, ప్రజల రక్షణే మా మొదటి ప్రధాన దేయం అని ముఖ్యమంత్రి కెజిర్వాల్ అన్నారు.

న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనేర్ ప్రణవ్ తయాల్ మాట్లాడుతూ, బాధితుడి పేరు పటేల్ సాజన్ కుమార్ అని తెలిపారు. అతను ఓ చాందిని చౌక్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు విచారణలో తేలింది. డెలివరీ పార్టనర్ ఇచ్చిన రిటన్ పోలీస్ కంప్లైంట్ లో.. పటేల్ సాజన్ తన తోటి అసోసియేట్ జిగర్ పటేల్ తో ఉన్నట్లు తేలింది.

వీరిద్దరూ కలిసి టాక్సీలో ఒక క్లయిన్ట్ కు డబ్బులు డెలివరీ చేయడానికి వెళ్తున్నారని చెప్పారు. తదుపరి సమాచారం తమ విచారణ పూర్తి అయ్యాక, అని నిజాలు బయటపెడతామని తెలిపారు. ఢిల్లీ పోలీస్ త్వరలో దీని వెనక ఉన్నదెవరో మీడియా ముందుకు తెస్తామని డిప్యూటీ కమీషనర్ అన్నారు.

Exit mobile version