Sunday, May 5, 2024
HomeCinemaVijay Thalapathy : సినిమా షూటింగ్లో హీరో విజయ్ కు ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Vijay Thalapathy : సినిమా షూటింగ్లో హీరో విజయ్ కు ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Vijay Thalapathy : సౌత్ ఇండియన్ స్టార్ హీరో దళపతి విజయ్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇక ఈ సినిమా కోసం విజయ్ చాలా కాలం తర్వాత తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాను బారి స్కేల్ లో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా విజయ్‌కి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వార్తలకు కారణం విజయ్ కు సంబందించిన ఫోటోలు. హరిహర వీరమల చిత్ర నిర్మాత అయినా ఎ.ఎం రత్నం తన గిల్లి సినిమా మళ్లీ విడుదల చేసి విజయం సాధించాడు. ఇటీవల ఈయన విజయ్ ను కలిసాడు. దీనికి సంబందించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే విజయ్ చేతికి బలమైన గాయం కనిపించింది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా షూటింగ్‌లో విజయ్‌కి ఈ గాయం అయినట్టు తెలుస్తుంది.

vijay-thalapathy-injured-in-film-sets

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన విజయ్ అభిమానులు ఆయనకు సినిమాపై ఎంత మక్కువ ఉందొ అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని AGS ఎంటర్‌టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా లియో సినిమా కంటే బారి విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts