Tuesday, May 7, 2024
HomeCinemaMahesh Babu: ఆ హీరోయిన్ కోసం పెద్ద త్యాగం ఏ చేసినా మహేష్ బాబు.. ఎం...

Mahesh Babu: ఆ హీరోయిన్ కోసం పెద్ద త్యాగం ఏ చేసినా మహేష్ బాబు.. ఎం చేసాడో ఊహించలేరు..

Mahesh Babu Sacrifice: టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిల్చిన చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ఇది. నాన్ స్టాప్ బ్రేక్స్ తో ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతూ ఈ చిత్రం షూటింగ్ ముందుకెళ్తుంది. మొన్నటి వరకు రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు కెమరామెన్ పీ ఎస్ వినోద్ సినిమా నుండి తప్పుకోవడం తో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. త్రివిక్రమ్ తో గతం లో ఆయన అలా వైకుంఠపురంలో, అరవింద సమేత వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తో గొడవ కారణంగానే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు టాక్.

mahesh-babu-sacrifice

మళ్ళీ ఎప్పుడు షూటింగ్ మొదలు అవ్వుద్దో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి. మహేష్ బాబు కూడా తన కుటుంబం తో కలిసి ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తున్నాడు. ఆగష్టు 9వ తేదీ ఆయన పుట్టినరోజు సందర్బంగా మొదటి సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నారు అని టాక్ ఉంది. ఇక పోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా ఆమె ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది, పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కానీ మూవీ యూనిట్ తో ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది(Mahesh Babu Sacrifice). ఇప్పుడు ఆమె స్థానం లోకి మీనాక్షి చౌదరి వచ్చింది.

keerthy-suresh

పూజా హెగ్డే చెయ్యాల్సిన మెయిన్ హీరోయిన్ రోల్ ఇప్పుడు శ్రీలీల చేస్తుంది. అయితే శ్రీలీల కంటే ఈ చిత్రం లో ఎక్కువ పాత్ర మీనాక్షి చౌదరి కి ఉంటుందట. ఆమె పాత్ర సినిమాలో చాలా ఎమోషన్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మహేష్ కి విలన్స్ కి మధ్య వైరం ఈమె పాత్ర కోసమే ఉంటుందట. సినిమాకి వెనుముక లాగా నిలిచే ఈ పాత్ర ప్రతీ ఒక్కరికి బాగా కనెక్ట్ అవ్వబోతుంది అని అంటున్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనిపిస్తూనే, సెంటిమెంట్ ని కూడా గుండెల్ని పిండేసే రేంజ్ లో చెయ్యబోతున్నాడని టాక్. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

mahesh-babu-guntur-karam

ఇకపోతే మహేష్ బాబు అతి త్వరలోనే రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈ ఏడాది లోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా 9 వ తారీఖున వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అన్నీ బాషలకు సంబందించిన సూపర్ స్టార్స్ ఇందులో నటించబోతున్నారు. RRR చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న రాజమౌళి, ఈ చిత్రం తో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts