Monday, April 29, 2024
HomeCinemaRam Charan-Prabhas: రామ్ చరణ్ అసహ్యించుకున్న కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్.. అదేం...

Ram Charan-Prabhas: రామ్ చరణ్ అసహ్యించుకున్న కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్.. అదేం సినిమా అంటే..

Ram Charan-Prabhas: ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం, అది హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం అనేది మన టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా కామన్ గా జరిగే విషయం. అలా రామ్ చరణ్ చెయ్యాల్సిన సినిమా ఒకటి ప్రభాస్ చేసాడు, ఫలితంగా అతనికి యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా పేరే ‘డార్లింగ్’. ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో మామూలు అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, సుమారుగా ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

ram-charan-rejected-this-movie-but-prabhas-did-it-and-made-a-blockbuster

ఈ సినిమాకి ముందు ప్రభాస్ మాస్ ఇమేజి విపరీతంగా ఉండేది. ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ ఉండేది కాదు, కానీ ఎప్పుడైతే ఈ సినిమా విడుదలైందో అప్పటి నుండి ఆయనకీ యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. స్టోరీ సరికొత్తగా ఉండడం, పాటలు అద్భుతంగా రావడం వల్ల ఈ చిత్రం అంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకి పోటీ గా అప్పట్లో బాలయ్య బాబు ‘సింహా’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు(Ram Charan Prabhas). దాని మేనియా ని తట్టుకొని కూడా ఈ చిత్రం 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది అంటే సాధారమైన విషయం కాదు.

ram-charan

అయితే ఈ సినిమాని ముందుగా కరుణాకరన్ ప్రభాస్ తో చెయ్యాలని అనుకోలేదట, రామ్ చరణ్ తో చెయ్యాలని అనుకున్నాడు. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ లవ్ స్టోరీ చెయ్యాలని అనుకున్నాడు. చాలా కథలు విన్నాడు, అందులో డార్లింగ్ ఒకటి. అయితే ఈ చిత్రం లో ఫస్ట్ హాఫ్ మొత్తం అబద్దం అనే ట్విస్ట్ ఇంటర్వెల్ లో తెలుస్తాది కదా.? దానిని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం తో రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాడట. ఇక ఆ సమయం లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ వద్ద ఈ స్టోరీ వెళ్ళింది.

prabhas

ఆయన వెంటనే ఒప్పుకొని చెయ్యడం, అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా, కల్ట్ లవ్ స్టోరీ స్థాయిని తెచ్చుకోవడం అన్నీ అలా జరిగిపోయాయి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూట్ లో చాల బిజీ గా ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ప్రాజెక్ట్ కే టీజర్ కి కూడా బానే స్పందన వచ్చింది. సలార్ రిలీజ్ కోసం ఫాన్స్ తహతహ లాడిపోతున్నారు. ఇక రామ్ చరణ్ సంగతికి వస్తే రామ్ ప్రస్తుతం సినిమాల నుండి బ్రేక్ తీసుకుని కూతురితో సమయం గడుపుతున్నాడు, మరి కొద్దీ రోజులకు గాని సినిమా షూటింగ్ కి తిరిగి రాడంట రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ సినిమా కోసం ఫాన్స్ వేచి చూడాల్సిందే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts