Home News ప్రముఖ తెలుగు యాంకర్ కన్నుమూత.. కుప్పకూలిన తెలుగు రాష్ట్ర ప్రజలు..

ప్రముఖ తెలుగు యాంకర్ కన్నుమూత.. కుప్పకూలిన తెలుగు రాష్ట్ర ప్రజలు..

telugu-first-news-reader-shanthi-swaroop-is-no-more-every-celebrity-and-politician-share-their-condolences

మన తెలుగు లో మొట్టమొదటి న్యూస్ రీడర్ ఆయన, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ విభజన అవ్వక ముందు చాల ముందు దాదాపు 1980 లో ఈయన తెలియని వారు ఉండరు. ప్రతి ఇంట్లో వినిపించే పేరు అది. ఆయనే ‘శాంతి స్వరూప్’. అప్పట్లో ఉన్న ఒక్కగాని ఒక్క న్యూస్ ఛానల్ దూరదర్శన్. అందులో ఈయన మొదటి తెలుగు యాంకర్ మరియు న్యూస్ రీడర్. లెజెండరీ శాంతి స్వరూప్ గారు ఈరోజు మరణించారు, ఆయన వయసు 74 ఏళ్ళు. రెండు రోజుల క్రితం గుండె కు సంబందించిన సమస్య తో బాధపడుతున్నారు అని కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. రెండు రోజులు చావుతో యుద్ధం చేసి ఈరోజు స్వర్గీయులు అయ్యారు శాంతి స్వరూప్ గారు.

1982 నవంబర్ 14న ఈయన తన మొదటి న్యూస్ రిపోర్టింగ్ దూరదర్శన్ లో చేసారు. ఆయన 2011 వరకు రిటైర్ అయ్యే వరకు అందులోనే పనిచేసారు. ఈ సోషల్ మీడియా అవేమి లేని సమయంలోనే ఆయా న్యూస్ రీడర్ గా ఒక ఊపు ఊపారు. ఆయన న్యూస్ చదివే విధానం అందరిని అంత ఆకట్టుకునేది. ఆయన న్యూస్ కోసం టీవీల ముందు అతుక్కుని కూర్చునే వారు అంటే అర్ధం చేసుకోండి ఆయన క్రేజ్. ఈయన మరణం పై ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లోని పలు ప్రముఖ రాజకీయ నాయకులూ సంతాపం తెలిపారు.

Exit mobile version