Sunday, April 28, 2024
HomeCinemaAnushka : ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి.. జనసేన నుంచి నగరి లో రోజా పై పోటీ..

Anushka : ఎమ్మెల్యేగా అనుష్క శెట్టి.. జనసేన నుంచి నగరి లో రోజా పై పోటీ..

Anushka Shetty : ప్రస్తుతం ఆంధ్ర లో ఎన్నికల వేడి మొదలైయింది. ఏపీ సీఎం జగన్ ను గడ్డ దింపేందుకు చంద్రబాబు(టీడీపీ), పవన్ కళ్యాణ్(జన సేన), నరేంద్ర మోడీ(బీజేపీ) అందరూ కలిసి ఒక కూటమిలా ఏర్పడి ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఒక పక్క మొన్నటివరకు జగన్ కు మద్దతుగా ఉన్న బీజేపీ ఈ కూటమిలో చేరడం జగన్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎవరి స్టైల్ లో వారు అప్పుడే ప్రచారాలు కూడా మొదలు పెట్టేసారు.

roja-selvamani

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ జనసేన పార్టీ లో చేరనుందట. ఆ హీరోయిన్ ని ఎమ్మెల్యే రోజా పై నుంచో పెట్టాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అట. రోజాకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న వైరం తెలిసిందే. ఇద్దరి మధ్య నీరు పోసిన బగ్గుమనేంత వేడి ఉంది. ఈ సారి ఏదైనా చేసి ఎమ్మెల్యే రోజాను ఓడించాలని పవన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

anushka-shetty

ఇక ఆ టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు మన స్వీటీ ‘అనుష్క శెట్టి’. ఈ వార్త విని జన సేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, ఈ సారి గెలిచేది జనసేన అంటూ అప్పుడు ట్వీట్లు మొదలు పెట్టేసారు. కానీ ఇది నిజమేనా ? స్వీటీ రాజకీయాల్లోకి రావటం ఏంటి ? కొద్దీ కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇటీవలే మిస్ శెట్టి అనే సినిమా చేసింది. ఇప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లోకి రానుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది జనసేన పార్టీ అధినేతలు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts